అతి చెత్త రైల్వేస్టేష‌న్‌ ను అద్భుతంగా మార్చిన మహిళా కళాకారులు

5887

బీహార్‌లో అతి చెత్త రైల్వేస్టేష‌న్‌గా ముద్ర ప‌డిన మ‌ధుబ‌ని రైల్వేస్టేష‌న్ ప్ర‌స్తుతం కొత్త అందాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. మిథిలా పెయింటింగ్స్‌తో రైల్వే స్టేష‌న్ రూపురేఖ‌ల‌ను అధికారులు మార్చివేశారు. కొత్త పెయింటింగ్స్ రాక‌తో మ‌ధుబ‌న్ స్టేష‌న్ స‌రికొత్త రూపును సంత‌రించుకుంది.

స్థానిక పెయింట‌ర్ల సాయంతో కేవలం రెండు నెలల్లోనే ఈ మార్పును తీసుకు రాగ‌లిగామ‌ని రైల్వే డివిజిన‌ల్ మేనేజ‌ర్ ఆర్‌కె జైన్ తెలిపారు. స్థానిక క‌ళాకారులు ముందుకు వ‌చ్చి ఉచితంగా సేవ‌లు అందించ‌డంతో ఈ ప‌ని సాధ్య‌మైంద‌ని జైన్ మీడియాకు తెలిపారు.

స్టేష‌న్‌కు కొత్త రూపు తెచ్చేందుకు దాదాపుగా 225 మంది ఆర్టిస్టులు క‌ష్ట‌ప‌డ్డార‌ని జైన్ తెలిపారు. ఆర్టిస్టుల్లో 80 శాతం మంది మ‌హిళ‌లే అని ఆయ‌న తెలిపారు.

14వేల చ‌ద‌ర‌పు అడుగుల పొడ‌వు క‌లిగిన రైల్వే గోడ‌ల‌పై వివిధ ర‌కాల థీమ్‌ల‌తో కూడిన పెయింటింగ్స్ వేసి స్థానిక క‌ళాకారులు ప్ర‌పంచ రికార్డు సృష్టించార‌ని జైన్ తెలిపారు.

NEWS UPDATES

CINEMA UPDATES