నవంబర్ 26 నుంచి కొత్త షెడ్యూల్ లో మహేష్ బాబు

387

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ “భరత్ అను నేను”. ఈ మూవీ పై ఇప్పటికే జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం అయిన “శ్రీమంతుడు” ఒక రేంజ్ లో హిట్ అయ్యింది. అయితే గత కొంత కాలంగా “భరత్ అను నేను” సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలను, సిఎం చాంబర్ కి సంబంధించిన సీన్స్ తో పాటు ఒక ఫైట్ సీన్ ని కూడా షూట్ చేసారట మూవీ టీం. ఇదిలా ఉంటే ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు మూవీ టీం. మూవీ లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ పై కొన్ని సీన్స్ అక్కడ తీస్తారట. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో కలిసి పర్సనల్ ట్రిప్ లో ఉన్నాడు. అక్కడి నుంచి మహేష్ బాబు ఈనెల 20 న తిరిగి వస్తున్నాడు. ఈనెల 26 నుంచి మహేశ్ బాబు ఈ కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవుతాడట. బాలీవుడ్ కైరా అద్వానీ మహేష్ సరసన నటిస్తుంది. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న రిలీజ్ అవబోతుంది.

NEWS UPDATES

CINEMA UPDATES