అక్క దర్శకత్వంలో నటిస్తే అదే నా ఆఖరు సినిమా అవుతుంది

386

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి అయిన మంజుల లేటెస్ట్ మెగా ఫోన్ పట్టుకొని డైరెక్ట్ చేసిన మూవీ “మనసుకి నచ్చింది”. సందీప్ కిషన్ హీరో గా నటించిన ఈ మూవీ లో అమైర దస్తూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీ కి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తన అక్క దర్శకత్వం లో నటిస్తే అదే మహేష్ బాబు కి ఆఖరు మూవీ అవుతుంది అంట. అవును ఈ విషయాన్నీ స్వయానా మహేష్ బాబే అన్నాడు.

నమ్రత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో దీని గురించి మాట్లాడుతూ, గౌతం ఒకసారి మహేష్ బాబు ని మంజుల ఆంటీ తో సినిమా చెయ్యవా అని అడిగాడు అంట. దానికి మహేష్ బాబు వెంటనే “మీ ఆంటీ తో చేస్తే అదే నా చివరి సినిమా” అవుతుంది అని పంచ్ వేసాడు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ ద్వారా ఈ ఘట్టమనేని వారసురాలు ఎంత మందిని ఆకట్టుకుంటుందో చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES