టీఆర్ఎస్ ముద్దు… చిట్టెం వద్దు

932

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో టికెట్ల పంచాయ‌తీ ఇంకా తేల‌డం లేదు. 105 మందికి టికెట్లు ఒకేసారి ప్ర‌క‌టించారు. కానీ ఇన్నాళ్లు టికెట్లపై ఆశ‌లు పెట్టుకున్న నేతలు అస‌మ్మ‌తి స్వ‌రం వినిపిస్తున్నారు.

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌నగ‌ర్ జిల్లా మ‌క్త‌ల్ తాజా ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహ‌న్‌రెడ్డికి టికెట్ ఇవ్వ‌డంతో అస‌మ్మ‌తి భ‌గ్గుమంది. ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకిస్తూ మ‌క్త‌ల్‌లో భారీగా అస‌మ్మ‌తి నేత‌లు స‌భ ఏర్పాటు చేశారు. అస్మ‌మతి నేత‌లు అన్ని మండ‌ల కేంద్రాల్లో భారీగా ఆత్మ‌గౌర‌వ‌ స‌భ‌లు ఏర్పాటు చేస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో చిట్టెం నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌ర్దుల‌కే టికెట్ కేటాయించాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారు. చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డిపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని…. ఆయ‌న టికెట్ మార్చ‌క‌పోతే టీఆర్ఎస్ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని వీరు అంటున్నారు.

”టీఆర్ఎస్ ముద్దు… చిట్టెం వ‌ద్దు” అంటూ వీరు స్లోగ‌న్ అందుకున్నారు. ”చిట్టెం రాంమోహ‌న్‌రెడ్డి హ‌ఠావో… టీఆర్ఎస్ బ‌చావో” అంటూ పోస్ట‌ర్లు ముద్రించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఈ పోస్ట‌ర్లు భారీగా వెలిశాయి.

NEWS UPDATES

CINEMA UPDATES