ఐశ్వ‌ర్య‌కు పోటీ వ‌చ్చేట్టుంది!

5551

మిస్ వ‌ర‌ల్డ్ మానుషి చిల్ల‌ర్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాష‌న్ ఐకాన్ ఆఫ్ ద ఇండియాగా మారుతోంది. అందాల రాణి కిరీటం ఒక్క ఏడాది మాత్ర‌మే ఉంటుంది. ఫ్యాష‌న్ క్వీన్‌గా ఓ సారి జనం మ‌దిలో ముద్ర వేసుకుంటే ఆ కిరీటం కనీసం ఒక ద‌శాబ్దం పాటు అయినా నిల‌బ‌డి పోతుంద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లుంది. ఇప్పుడామె వార్డ్‌రోబ్ మొత్తం ప్ర‌ఖ్యాత డిజైన‌ర్‌లు రూపొందించిన డ్ర‌స్‌ల‌తో హొయ‌లు పోతోంది. అప్పుడ‌ప్పుడూ ఛిల్ల‌ర్ ఆడ్ర‌స్‌లు ధ‌రించి ఫొటో షూట్ చేసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌చేస్తుంటుంది. సోష‌ల్ మీడియా లో ఇప్పుడు  హాట్‌హాట్‌గా వైర‌ల్ అవుతున్న ఫొటోలు మానుషి ఫ్యాష‌న్ డిజైన‌ర్ డ్ర‌స్‌లే.  ఒక్కో పోస్ట్‌కి వేల‌ల్లో, ల‌క్ష‌ల్లో లైక్‌లు వ‌స్తుంటాయి. అలాగ‌ని అన్నింటికీ అన్నేసి లైక్‌లు వ‌స్తాయ‌ని మోస‌పోకూడ‌దు. చూడ‌డానికి హాయిగా ఉన్న వాటికే వేలు, ల‌క్ష‌ల్లో లైక్‌లు. ఇదేం డ్ర‌స్‌రా బాబూ అనిపించే వాటికి వంద‌ల్లోనే ఉంటున్నాయి లైక్‌లు. అంటే జ‌నానికి టేస్ట్ ఉంద‌న్న‌మాటే. ఎవ‌రూ గుడ్డిగా లైక్‌లు కొట్ట‌డం లేదు.


గ‌త మిస్‌ల‌కు దీటుగా!

ఏటా ఒక‌ మిస్ ఇండియా వ‌స్తుంది. వాళ్ల‌లో అప్పుడ‌ప్పుడూ మిస్‌ యూనివ‌ర్స్‌, వ‌ర‌ల్డ్ కిరీటాలు గెలుస్తూనే ఉంటారు. అయితే వాళ్ల‌లో చాలా మంది మిస్ కిరీటం త‌ర్వాత వాళ్ల‌కు .న‌చ్చిన రంగంలో స్థిర‌ప‌డి పోతుంటారు. మోడ‌లింగ్‌, సినిమా రంగాల్లో స్థిర‌ప‌డిన వాళ్లు కొంత కాలం మీడియాలో క‌నిపిస్తుంటారు. ఆ జాబితాలో ఐశ్వ‌ర్యారాయ్‌, ప్రియాంక చోప్రా వంటి వాళ్లు అప్పుడెప్పుడో వ‌చ్చిన కిరీటం తాలూకు జ్ఞాప‌కాల‌ను గుర్తు చేస్తూనే ఉంటారు. ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌రిగితే అక్క‌డ వీళ్లు ధ‌రించిన దుస్తులు హైలైట్ అవుతుంటాయి. కేన్స్‌కు వెళ్లినా స‌రే… మ‌న భార‌త మీడియా క‌ళ్ల‌న్నీ ఐశ్వ‌ర్య ఏ డ్ర‌స్ ధ‌రించి వ‌స్తుందోన‌ని లెన్స్‌లు స‌రిచేసుకుని ఎదురు చూశాయి. లెన్స్ జూమ్ చేసి ఐశ్వ‌ర్య ప్ర‌తి క‌ద‌లిక‌నూ, డ్ర‌స్ లో ప్ర‌తి అంగుళాన్ని క్యాప్చ‌ర్ చేసి దేశానికి చూపించేవాళ్లు కెమెరామెన్‌. ఐశ్వ‌ర్య అంత కాక‌పోయినా ప్రియాంక కూడా డ్ర‌స్‌ల ఎంపిక‌లో ప్ర‌త్యేక‌మైన టేస్ట్‌ను క‌న‌బ‌రిచేది. ఇప్పుడు మానుషి ధోర‌ణి చూస్తుంటే  ఫ్యాష‌న్ ప్ర‌పంచం  ఐశ్వ‌ర్య‌, ప్రియాంక‌ల‌ను త్వ‌ర‌గా మ‌ర్చిపోయేట్టుంది.


మూడు ల‌క్ష‌ల‌కు పైగా లైక్‌లు!
మానుషి ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన ఒక ఫొటోలో ఆమె పీచ్ క‌ల‌ర్ షీర్ ఫెదర్‌డ్ గౌన్ ధ‌రించి ఉంది. జారా ఉమిర్‌జార్ డిజైన్ చేసిన డ్ర‌స్ అది. డ్ర‌స్‌లో ఎంబ్రాయిడ‌రీ, డిజైన్‌కు అనుగుణంగా బీడ్స్ కూడా కుట్టారు. ఆ ఫొటోకి అక్ష‌రాలా 3,95, 848 లైక్‌లు వ‌చ్చాయి. ఇదంతా ఏ నెల రోజుల్లోనో రెండు నెల‌ల్లోనో జ‌మ అయిన లైక్‌లు కాదు. కేవ‌లం ఐదు రోజుల్లో వ‌చ్చిన లైక్‌లు.

NEWS UPDATES

CINEMA UPDATES