నవంబర్ 25 న గ్రాండ్ గా “ఎంసిఏ” ఆడియో లాంచ్

219

న్యాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న మూవీ “ఎంసిఏ”. ఎంసిఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ప్రొడ్యూసర్ గా నిర్మితమవుతున్న ఈ మూవీ కి”ఓ మై ఫ్రెండ్” ఫేం అయిన వేణు శ్రీరామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క టిజర్ ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంది. నాని కి మరో హిట్ ఖాయం అని ప్రేక్షకులు అందరు ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ యొక్క ఆడియో లాంచ్ ని నవంబర్ 25న విడుదల చెయ్యబోతున్నట్లు దిల్ రాజు కాంపౌండ్ నుంచి సమాచారం అందింది. అయితే ఈ విషయంపై ఇంకా దిల్ రాజు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. “ఫిదా” మూవీతో ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. దివాకర్ మని కెమెరా వర్క్ అందించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. వదినా మరిదిల సెంటిమెంట్ ప్రకారం నడువనున్న ఈ మూవీ లో నాని కి వదిన గా సీనియర్ హీరోయిన్ అయిన భూమిక నటించిందట.

NEWS UPDATES

CINEMA UPDATES