మంత్రి గదికి తాళం వేసిన ఐఏఎస్‌

5988

ఐఏఎస్‌ అధికారులు సిన్సియర్‌గా పనిచేయడం, అధికార పార్టీ నేతలను ఢీకొనడం, చివరకు మంత్రులను కూడా ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. కానీ ఈమె మరింత ఫైర్‌బ్రాండ్‌ అధికారిణి. తన విధి నిర్వహణలో ఎవరిని ఎదుర్కోవడానికైనా ఆమె సై అంటారు. సస్పెన్షన్లు, బదిలీలు ఆమెను ఎన్నడూ భయపెట్టలేకపోయాయి.

కర్ణాటకలోని హసన్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రోహిణిని గత జనవరిలో తప్పించారు. ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారిణిగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయినా రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పడంలో ఆమె ఎన్నడూ వెనుకంజ వేయలేదు. తాజాగా ఈ విషయం మరోమారు రుజువయ్యింది. పీడబ్లుడీ ఇన్‌స్పెక్షన్‌ బంగ్లాలో హసన్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎ.మంజు కార్యాలయానికి ఆమె తాళం వేయించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించి ప్రభుత్వ కార్యాలయాన్ని ఉపయోగించుకున్నారనే కారణంగా మంత్రి మంజుకు, పీడబ్లుడీ శాఖకు నోటీసులు కూడా జారీ చేశారు.

ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కోడ్‌ అమల్లోకి వచ్చేసిందని, ఇక ఎన్నికల పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని ఉపయోగించుకోవడం కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఆమె ఆ నోటీసులలో పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు షాక్‌ లివ్వడం రోహిణికి మామూలే. గత జనవరిలో తనను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె కర్ణాటక హైకోర్టులోనూ, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లోనూ సవాలు చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES