మెహ్రిన్ కు షాక్ ఇచ్చిన తమిళ డైరెక్టర్

274

సందీప్ కిషన్ హీరో గా మెహ్రిన్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ “కేరాఫ్ సూర్య”. “నా పేరు సూర్య” ఫేం అయిన సుశీంద్రన్ ఈ మూవీ ని డైరెక్ట్ చేసాడు. తెలుగు ఇంకా తమిళ్ లో ఏకకాలం లో తెరకెక్కిన ఈ మూవీ రెండు చోట్ల ఒకే రోజు విడుదలయింది. తెలుగు లో ఫ్లాప్ గా నిలిచినా ఈ మూవీ కి తమిళ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తమిళ వెర్షన్‌కు పాజిటివ్ రివ్యూలే వచ్చినప్పటికీ చాలామంది హీరో హీరోయిన్ కి మధ్య జరిగే సన్నివేశాల విషయంలో నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా అలాంటి ఫీడ్ బ్యాకే వచ్చింది. దీంతో తమిళ వెర్షన్ విషయంలో దర్శకుడు సుశీంద్రన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మూవీ మెహ్రీన్ పార్ట్ నుంచి 20 నిమిషాల సన్నివేశాలకు కట్ చేసి ఎడిట్ చేసాడట. ఈ సన్నివేశాలు తొలగించాక మూవీ టైం 1 గంట 50 నిమిషాలకు వచ్చింది. దీంతో ఇప్పుడిది క్రిస్ప్ థ్రిల్లర్ లాగా తయారైందట. ఎడిటెడ్ వెర్షన్ ఆల్రెడీ థియేటర్లకు కూడా వెళ్లిపోయింది. తన సన్నివేశాలు తొలగిస్తున్న విషయాన్ని మెహ్రీన్‌కు సుశీంద్రన్ తెలియజేసి సారీ చెప్పాడట. తమిళ్ లో హిట్ కొట్టి సెటిల్ అయిపోదాం అని అనుకున్న మెహ్రిన్ కల ఈ మూవీతో నెరవేరలేదు అనమాట.

NEWS UPDATES

CINEMA UPDATES