మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ సరికొత్త ప్రపంచ రికార్డు

844
  • 118 వన్డేల్లో భారత కెప్టెన్ గా మిథాలీ ప్రపంచ రికార్డు
  • శ్రీలంకతో గాల్ వేదికగా ముగిసిన వన్డేతో మిథాలీ ఘనత
  • చార్లొట్టీ ఎడ్వర్డ్స్ 117 మ్యాచ్ ల ప్రపంచ రికార్డు తెరమరుగు

భారత మహిళా క్రికెట్.. వన్డే కెప్టెన్ గా మిథాలీరాజ్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.  శ్రీలంక తో గాల్ వేదికగా ముగిసిన తొలివన్డేలో భారతజట్టుకు నాయకత్వం వహించడం ద్వారా… 118 వన్డేల్లో కెప్టెన్ గా వ్యవహరించిన తొలి మహిళా క్రికెటర్ గా ప్రపంచ రికార్డుల్లో చేరింది.

గతంలో ఇంగ్లండ్ కెప్టెన్ చార్లొట్టీ ఎడ్వర్డ్స్ పేరుతో ఉన్న 117 మ్యాచ్ ల రికార్డును మిథాలీ తెరమరుగు చేసింది. అంతేకాదు…. భారతజట్టును రెండుసార్లు మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ కు చేర్చిన ఏకైక కెప్టెన్ మిథాలీ మాత్రమే. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 195 వన్డేలు ఆడిన మిథాలీ…118 మ్యాచ్ ల్లో నాయకత్వం వహించడం విశేషం.

NEWS UPDATES

CINEMA UPDATES