ఓటుకు నోటు…. రేవంత్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

738

రేవంత్ రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్‌ అని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు.  రేవంత్ రెడ్డి మంచోడిగా నటించి పార్టీ నాశనం అయ్యే పరిస్థితిని తెచ్చారన్నారు. ఓటుకు నోటు కేసులో డబ్బు సంచులతో సహా దొరికిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. చంద్రబాబు అనుమతి లేకుండా రాహుల్‌గాంధీని ఎలా కలుస్తారని ప్రశ్నించారు. పరిటాల సునీత, యనమల తమ పార్టీ వారని…. సొంతపార్టీ వారిపైనే వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నారని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు.

ఏపీ కేబినెట్ మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని…. వాటిపై సమాధానం చెప్పాలని సమావేశంలో నిలదీశామన్నారు. అందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారని అందుకే తాము వాకౌట్ చేశామన్నారు. అసలు రేవంత్ రెడ్డి స్థాయి ఏంటని ప్రశ్నించారు.  చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధికారం ఇచ్చి.. సర్వహక్కులు ఇచ్చారన్నారు. కానీ ఈ రోజు రాహుల్‌ గాంధీని కలవడం అంటే మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో మచ్చ తెచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మోత్కుపల్లి విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడానికి రేవంత్ రెడ్డే కారణమని మండిపడ్డారు.

రేవంత్‌ రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను చంద్రబాబు నమ్మి మోసపోయారన్నారు. కాకిలాగా రేవంత్ అరుస్తుంటే ఈ అరుపులన్ని మంచి అరుపులేనని చంద్రబాబు నమ్మారన్నారు. 25 శాతం ఓటు బ్యాంకు 7 శాతానికి పడిపోవడానికి రేవంత్ రెడ్డే కారణమన్నారు. రేవంత్‌ రెడ్డి వల్ల టీడీపీకి క్రెడిబులిటీ లేకుండాపోయిందన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వీడడం ఖాయమన్న నిర్దారణకు వచ్చేశామన్నారు. రాహుల్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నిస్తే… కలిస్తే తప్పేంటని రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఇంకా అనుమానం ఎందుకన్నారు. అసలు రేవంత్ రెడ్డి  సమావేశానికి హాజరవుతారని తాము భావించలేదని కానీ ఆయనే వచ్చారన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES