“ముని-4” గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చెప్పిన రాఘవ లారెన్స్

217

మన తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఎక్కువ హిట్ అయిన హారర్ సిరీస్ పేరు చెప్పమంటే టక్కున “ముని” సిరీస్ అని చెప్పేయొచ్చు. ఎందుకంటే “ముని” మూవీ తో పాటు వచ్చిన సీక్వెల్స్ కూడా అన్ని హిట్స్ గా నిలిచాయి. “ముని” “కాంచన” “గంగ” సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే ఈ సిరీస్ లో నెక్స్ట్ మూవీ అయిన “ముని 4” గురించి ఇప్పుడు ఆడియన్స్ అందరూ వెయిటింగ్.

ఇదిలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రాఘవ లారెన్స్ చెప్పాడు. అదేంటంటే ఈ మూవీ ని ఏప్రిల్ 6 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడుట రాఘవ లారెన్స్. ఈ “ముని” సిరీస్ ఒక రకంగా చెప్పాలంటే హారర్‌ కామెడీ జానర్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. సో అలాంటి మూవీస్ కి సీక్వెల్ తీయాలి అంటే కొంచెం టైం పడుతుంది అని రాఘవ లారెన్స్ అభిప్రాయం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి కూడా రాఘవ లారెన్సే దర్శకుడు. దర్శకత్వం చేస్తూనే సినిమాలకు కొరియోగ్రఫీ అందించే లారెన్స్ చిరంజీవి “సైరా నరసింహ రెడ్డి” సినిమాకు త్వరలో సాంగ్ కంపోజ్ చెయ్యబోతుండడం విశేషం.

NEWS UPDATES

CINEMA UPDATES