ఫ్యాన్సీ రేటుకు బన్నీ సినిమా నైజాం రైట్స్

265

ప్రస్తుతం నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై నాగబాబు సమర్పకుడిగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. ఈ సినిమా నైజాం హక్కుల కోసం ఫ్యాన్సీ ఆఫర్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఈ మూవీ నైజాం రైట్స్ కోసం 21 కోట్ల రూపాయల డీల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

బన్నీ నటించిన ఓ సినిమాకు నైజాంలో ఇంత ధర రావడం ఇదే ఫస్ట్ టైం. సాధారణంగా బన్నీ ఏ సినిమా చేసినా, నైజాంలో దాని మార్కెట్ 15 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల మధ్య పలుకుతుంది. కానీ ఈసారి నా పేరు సూర్య సినిమాకు ఇంత భారీ ఆఫర్ రావడానికి ఓ కారణం ఉంది. బన్నీ నటించిన డీజే సినిమాకు నైజాంలో 20 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అందుకే నా పేరు సూర్య సినిమాకు 21 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది ఏషియన్ సినిమాస్ సంస్థ.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విశాల్-శేఖర్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమా థియేటర్లలోకి రానుంది.

NEWS UPDATES

CINEMA UPDATES