చిన్న సినిమాకు పెద్ద ఆఫర్

183

చిన్న సినిమాగా వస్తోంది ఛలో. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు కూడా కొత్తే. మరోవైపు నాగశౌర్య మార్కెట్ కూడా డల్ అయింది. ఇలాంటి టైమ్ లో ఛలో సినిమాకు బడా ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి జాక్ పాటే కొట్టింది ఛలో మూవీ. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఏకంగా 2 కోట్ల 20 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి.

జెమినీ టీవీ ఛలో రైట్స్ దక్కించుకుంది. ఈమధ్యే రిలీజైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడం, త్రివిక్రమ్ లాంటి ప్రముఖులు రంగంలోకి దిగి ప్రచారం చేయడంతో ఛలోపై కాస్త బజ్ క్రియేట్ అయింది. అదే ఊపులో సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మేశారన్నమాట.

ఇక ఈ మూవీ డిసెంబర్ 29న థియేటర్లలోకి రానుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీలో నటించిన రష్మిక.. ఈ మూవీతో తెలుగుతెరకు పరిచయమౌతోంది. మణిశర్మ తనయుడు సాాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. నాగశౌర్యకు ఇది సొంత సినిమా. సొంత డబ్బులు పెట్టి నిర్మించాడు. సో.. ఈ మూవీ సక్సెస్ హీరోగానే కాకుండా, కలెక్షన్ల పరంగా కూడా నాగశౌర్యకు చాలా కీలకం.

NEWS UPDATES

CINEMA UPDATES