నాగశౌర్య సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

201

ప్రస్తుతం ‘ఛలో’ అనే సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వచ్చేనెల 29న ఛలోను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాపై నమ్మకంతో స్వయంగా నాగశౌర్య తల్లిదండ్రులు నిర్మాతలుగా మారారు. ఉషా మల్పూరి, శంకర ప్రసాద్ నిర్మాతలుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోంది ఛలో సినిమా.

ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో ఛలో సినిమా తెరకెక్కింది. హీరోయిన్ రష్మిక మండన్న కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ ద్వారా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. డిసెంబర్ 18న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

చాలా సినిమాల్లో క్యూట్ గా కనిపించిన నాగశౌర్య.. ఈ మూవీలో మాత్రం గడ్డం పెంచి కాస్త కొత్తగా, మేన్లీగా కనిపిస్తున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేయబోతున్నారు. సాగర్ మహతి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

NEWS UPDATES

CINEMA UPDATES