కళ్యాణ్ కృష్ణ కెరీర్ తో ఆడుకుంటున్న నాగార్జున

397

అక్కినేని నాగార్జునకి “సోగ్గాడే చిన్ని నాయన” వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అయితే దాని వెంటనే నాగార్జున వారసుడు అయిన నాగ చైతన్య తో “రారండోయ్ వేడుక చూద్దాం” వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ని అందించాడు. ఈ మూవీ తరువాత కళ్యాణ్ కృష్ణ రవితేజతో కలిసి ఒక మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. కానీ ఈ మూవీ ని ఇప్పుడు నాగార్జున స్టార్ట్ అవ్వకుండా చేస్తున్నాడట.

ఇంతకీ మేటర్ ఏంటి అంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మూడు సినిమాలు చేస్తాను అని నాగార్జునకి మాట ఇచ్చాడట కళ్యాణ్ కృష్ణ. అందుకు తగ్గట్టు గానే కళ్యాణ్ కృష్ణ కూడా “బంగార్రాజు” అనే మూవీ స్క్రిప్ట్ ని నాగార్జున కోసం రెడీ చేసాడు కళ్యాణ్ కృష్ణ. కానీ ఆ మూవీ స్క్రిప్ట్ నచ్చక కొన్ని చేంజెస్ చెప్పాడు నాగార్జున. పైగా నాగార్జున వేరే మూవీస్ తో బిజీగా ఉన్నాడు. సో ఇదంతా వర్క్ అవుట్ కాదు అని గ్రహించిన కళ్యాణ్ కృష్ణ రవితేజతో మూవీ ఒప్పుకున్నాడు. తన బ్యానర్ లో మూవీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు వేరే బ్యానర్ లో మూవీ ఎందుకు చేస్తున్నావ్ అని కళ్యాణ్ కృష్ణ పై సీరియస్ అయ్యి తన మూవీని స్టార్ట్ అవకుండా చేస్తున్నాడట నాగార్జున. మరి కళ్యాణ్ కృష్ణ రవితేజ మూవీని ఆపేసి నాగార్జునతో మూవీ తీస్తాడా లేకపోతే నాగార్జునకి ఎదురెళ్లి రవితేజతో మూవీ తీస్తాడా అనేది వేచి చూడాలి..

NEWS UPDATES

CINEMA UPDATES