ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌పై కోర్టు ఆగ్ర‌హం

2384

ఆంధ్ర‌జ్యోతి మీడియా ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై నాంప‌ల్లి కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేవేసిన ప‌రువున‌ష్టం దావా కేసులో కోర్టుకు రాధాకృష్ణ హాజ‌రుకాక‌పోవ‌డంపై న్యాయ‌మూర్తి మండిప‌డ్డారు. కోర్టు ఆదేశించినా స‌రే రాధాకృష్ణ హాజరుకాక‌పోవ‌డం ఏమిట‌ని మండిపడింది. కోర్టులంటే లెక్క‌లేని త‌నంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే నెల‌5న త‌ప్ప‌ని స‌రిగా కోర్టు ముందు హాజరుకావాల్సిందేన‌ని ఆదేశించింది. రాధాకృష్ణ‌తో పాటు ఆయ‌న మీడియాలో కీల‌క పాత్ర‌పోషిస్తున్న మ‌రో ఆరుగురికీ కోర్టు ఇవే ఆదేశాలను జారీచేసింది.

కొన్ని నెల‌ల క్రితం వైఎస్ జ‌గ‌న్.. ప్ర‌ధాని మోడీని క‌లిశారు. తాము ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, నిధులు అంశంపై చ‌ర్చించామ‌ని జ‌గ‌న్ మీడియాతో చెప్పారు. అయితే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక మాత్రం కేసు మాఫీ కోస‌మే ప్ర‌ధానిని క‌లిసి జ‌గ‌న్ విన్న‌వించుకున్నారంటూ క‌థ‌నం రాసింది. మోడీ, జ‌గ‌న్ మాట్లాడుకుంటుంటే ప‌క్క‌నే కూర్చుని విన్నట్టుగా కొన్ని వ్యాఖ్య‌ల‌ను ఆ ప‌త్రిక ప్ర‌చురించింది. పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకే రాధాకృష్ణ ప‌నిగ‌ట్టుకుని త‌ప్పుడు క‌థ‌నాలు రాశారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. అయితే కోర్టు ఆదేశించినా రాధాకృష్ణ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు.

NEWS UPDATES

CINEMA UPDATES