సోమవారం నుంచి ఎంసీఏ హంగామా

198
నాని నటిస్తున్న ఎంసీఏ సినిమా, అఖిల్ చేస్తున్న హలో సినిమాల మధ్య పోటీ తప్పదని నిన్ననే తేలిపోయింది. ఎంసీఏ సినిమాను హలో కంటే ఒకరోజు ముందు, డిసెంబర్ 21న విడుదల చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించాడు. అయితే ఈ మూవీకి సంబంధించి పెద్దగా ప్రచారం ప్రారంభంకాలేదు. మరోవైపు హలో మాత్రం ప్రమోషన్ తో హోరెత్తిస్తోంది. దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
వచ్చే సోమవారం నుంచి ఎంసీఏ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయని ప్రకటించాడు. ప్రచారం విషయంలో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్స్ తీసుకొచ్చింది దిల్ రాజు అనే విషయం తెలిసిందే. ఇలాంటి నిర్మాత తన సినిమాకు ప్రచారం విషయంలో కాంప్రమైజ్ కాడు. ఎంసీఏ విషయంలో కూడా అదే జరగనుంది. సోమవారం నుంచి ఈ సినిమా ఓ రేంజ్ లో సందడి చేయబోతోంది.
సోమవారం ఎంసీఏ పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. సినిమా జ్యూక్ బాక్స్ ను యూట్యూబ్ లో పెడుతున్నారు. అంతేకాదు, అదేరోజు థియేట్రికల్ ట్రయిలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. మూవీ రిలీజ్ కు సరిగ్గా 3 రోజుల ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. అంతకంటే ముందు నాని, సాయిపల్లవి, భూమిక, వేణుశ్రీరామ్, దేవిశ్రీప్రసాద్ తో ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES