నారాయణకు చంద్రబాబు, చైతన్యకు లోకేష్‌ గాడ్‌ ఫాదర్లు…. ఇక అధికారులు ఏంచేస్తారు?

1110

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో విద్యాశాఖ ప‌నితీరును చూస్తే ఎవ‌రికైనా ఆగ్ర‌హం వ‌స్తుంది. అలాంటిది ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబుకు మరెంత కోపం రావాలి? దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ సున్నితంగానే హెచ్చరిస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌లి కాలంలో కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు పెర‌గ‌డం, విద్యాశాఖ వ‌ల్ల ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు రావ‌డంతో ముఖ్య‌మంత్రి స‌హ‌నానికి ప‌రీక్ష గా మారింది. దీంతో ఇటీవ‌ల‌నే రెండు సార్లు ముఖ్య‌మంత్రి విద్యాశాఖ ఉన్న‌తాధికారులతో, మంత్రితో స‌మావేశం నిర్వ‌హించారు. కానీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావును మాత్రం ఏమీ అన‌లేదు. విద్యాశాఖ అధికారుల‌పై మాత్రం ఆగ్ర‌హం వెలిబుచ్చారు. దీనికి కార‌ణం ఒక్క‌టే అని చ‌ర్చ జ‌రుగుతోంది.

కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన గంటా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ట‌చ్‌లో ఉన్నారు. ఆయ‌న‌తో పాటు రాష్ర్టంలోని కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ప‌వ‌న్‌కు ట‌చ్‌లో ఉన్నారు. మ‌రో వైపు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతోనూ వీరికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముద్ర‌గ‌డ‌తో వైరం పెట్టుకోవాల‌ని, ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయాల‌ని సి.ఎం.ఓ ఆదేశించినా ప‌లు సంద‌ర్భాల్లో గంటా స‌సేమిరా అన్నారు. దీనిపై ముఖ్య‌మంత్రి సైతం ప‌లు సంద‌ర్భాల్లో గంటాపై అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు. ఈ స‌మ‌యంలోనే గంటాతో పాటు కాపు సామాజ‌కి వ‌ర్గానికి చెందిన వారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో వెళ‌తార‌నే ప్ర‌చారాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. దీంతో ముఖ్య‌మంత్రి మౌనం వ‌హించాల్సి వ‌చ్చింది.

మ‌రో వైపు కార్పొరేట్‌ కాలేజీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటే ముందుగా త‌న బంధువు అయిన నారాయ‌ణ కాలేజీల‌పై చ‌ర్య‌లు ఆరంభించాలి. చైత‌న్య కాలేజీలపైన కూడా చ‌ర్య‌లు తీసుకోవాలి. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌కు ముఖ్య‌మంత్రి అండ‌గా ఉన్నారు. చైత‌న్య కాలేజీల‌కు లోకేష్ అండ‌గా నిలిచారు. ఇంకా ఎవ‌రి పైన చ‌ర్య‌లు తీసుకుంటారు? మ‌ంత్రి నారాయ‌ణతో వివాదం పెట్టుకునే అవ‌కాశం బంధువైన గంటాకు ఎలా ఉంటుంది? ఇవ‌న్నీ అయ్యే ప‌నులు కావు. ఇపుడు అత్య‌ధికంగా విద్యార్థులు ఇబ్బంది ప‌డేది నారాయ‌ణ‌, చైత‌న్య కాలేజీల్లోనే. అరాచ‌కాలు జ‌రిగేది కూడా ఆ రెండింటిలోనే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎవ‌రిపై ఎవ‌రు చ‌ర్య‌లు తీసుకోవాలి? అన్న‌ది ప్ర‌శ్న‌. వీట‌న్నింటినీ వ‌దిలేసి మంత్రి గంటా మాత్రం నిశ్చింత‌గా ఉన్నారు. ముఖ్య‌మంత్రి ప‌లు సంద‌ర్భాల్లో చేసిన సూచ‌న‌ల‌ను కూడా మంత్రి ప‌ట్టించుకోలేదు. అదేమంటే రాజ‌కీయ ప‌ర‌మైన లావాదేవీలే కార‌ణంగా భావిస్తున్నారు. ఇపుడున్న ప‌రిస్థితుల్లో గంటాను ప‌న్నెత్తి మాట‌నే సాహ‌సం చేసే స్థాయిలో ముఖ్య‌మంత్రి లేరు. దీని ప్ర‌భావం రాబోయేరోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES