25 ల‌క్ష‌ల విద్యార్ధుల నైపుణ్యానికి ప‌రీక్ష‌

263

దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లోని విద్యార్ధుల నైపుణ్యానికి ప‌రీక్ష జ‌రిగింది. ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ ఎయిడెడ్ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న‌3,5, 8 వ త‌ర‌గ‌తుల‌కు చెందిన దాదాపు 25 ల‌క్ష‌ల మంది విద్యార్ధులు ఈ ప‌రీక్ష‌లో పాల్గొన్నారు. ఎన్‌సీఈఆర్‌టి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ ప‌రీక్షలో మ్యాథ్స్‌, సైన్స్‌, సోష‌ల్ స్ట‌డీస్‌, భాష‌ల‌పై విద్యార్ధుల‌కు ఉన్న‌ జ్ఞానాన్ని ప‌రీక్షించారు.

నేష‌న‌ల్ ఎచీవ్‌మెంట్ స‌ర్వే గా పిల‌వ‌బ‌డుతున్న ఈ ప‌రీక్ష ఎంతో పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగింద‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ్‌దేవ‌క‌ర్ తెలిపారు. థ‌ర్డ్ పార్టీ వెరిఫికేష‌న్ ద్వారా ఈ ప‌రీక్ష జ‌రిగిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

3వ త‌ర‌గ‌తి, 5వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు 45 ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌శ్నాప‌త్నం, 8వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు 60 ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌శ్నాప‌త్రం ఇచ్చారు. దేశ‌వ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాల్లో 700 జిల్లాల్లో 1.1 ల‌క్ష‌ల పాఠ‌శాల‌ల్లో ఈ నైపుణ్య ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 1.75 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వేత‌ర సిబ్బంది ఈ ప‌రీక్ష‌ల‌ను ద‌గ్గ‌రుండి నిర్వ‌హించారు. ఈ నైపుణ్య ప‌రీక్ష వ‌ల్ల పిల్ల‌ల్లో లోపాలను తెలుసుకునేందుకు అవ‌కాశం క‌ల‌గ‌నుంది.

ప్ర‌థ‌మ్ అనే ఒక ఎన్‌జీఓ చేప‌ట్టిన స‌ర్వే ప్ర‌కారం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధులు చిన్న చిన్న విష‌యాల‌ను కూడా నేర్చుకోలేక‌పోతున్నార‌ని త‌న నివేదిక‌లో తెలిపింది. ఈ కార‌ణంగా అక్క‌డ వెన‌క‌బాటుత‌నం ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మౌతున్న‌ద‌ని కూడా తెలిపింది. దీంతో ప్ర‌భుత్వం నైపుణ్య ప‌రీక్ష‌ను నిర్వ‌హించి వారిలోని లోపాల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకోడానికి సిద్ద‌మ‌యింది. నైపుణ్య ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది.

NEWS UPDATES

CINEMA UPDATES