మురగదాస్ పై కోపం తో ఊగిపోతున్న నయనతార

493

అటు తమిళ్ ఇటు తెలుగు లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఒక స్టార్ డైరెక్టర్ పై కోపంతో ఊగిపోతుందట. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో “స్పైడర్” వంటి భారీ డిజాస్టర్ ని తెరకెక్కించిన ఏ.ఆర్. మురగదాస్. అవును ఏ.ఆర్. మురగదాస్ పై నయనతార చాలా కోపంగా ఉందట. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే ఏ.ఆర్. మురగదాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ప్లాన్స్ లో ఉన్నాడు. అయితే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించమని ఏ.ఆర్. మురగదాస్ నయనతార కి కబురు పంపాడట. కాని నయనతార మాత్రం ఏ మాత్రం మొహమాటం లేకుండా ఏ.ఆర్. మురగదాస్ సినిమాల్లో నటించను అని చెప్పిందట. అసలు నయనతార కి మురగదాస్ అంటే ఎందుకు అంత కోపం అంటే…. వీరిద్దరి కాంబినేషన్ లో గతం లో “గజినీ” అనే మూవీ వచ్చింది. అయితే ఆ మూవీ లో నయనతార సెకండ్ హీరోయిన్. అయినా సరే పాత్ర బాగుంది కదా అని నయనతార ఆ మూవీ లో నటిస్తే నయన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్స్ ని డిలీట్ చేసి రిలీజ్ చేసారట మూవీని. అందుకే అప్పటినుండి నయనతార మురగదాస్ పై సీరియస్ గా ఉందట.

NEWS UPDATES

CINEMA UPDATES