మూత్రాన్ని కొంటామంటున్నాడు ఈ బీజేపీ నేత

381

ఛీ.. ఛీ.. పాడు మాట‌లు అనుకోకండి. ఇప్పుడు చెప్పింది చాలా సీరియ‌స్ మాట‌. అది కూడా మేం చెప్ప‌ట్లేదు. కేంద్ర మంత్రి వ‌ర్యులు నితిన్ గ‌డ్క‌రీ మాష్టారు చెబుతున్నారు. అనుకుంటాం కానీ మాన‌వ శ‌రీరంలో ఏదీ వృధా కాద‌ని చెబుతుంటారు. ఆ మాట ఎంత నిజ‌మ‌న్న‌ది గ‌డ్క‌రీ సాబ్ చెప్పేది వింటే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ బాత్రూం అవ‌స‌రాల‌కు రూ.2 నుంచి రూ.5 వ‌ర‌కు చెల్లించాల్సి ఉండేది. అయితే.. అందుకు భిన్న‌మైన మాట గ‌డ్క‌రీ చెబుతున్నారు. అదేమిటంటే.. దేశ వ్యాప్తంగా మూత్రం బ్యాంకుల్ని తెరుస్తార‌ట‌. ఎందుకంటారా? ఇక్క‌డే ఉంది కీల‌క‌మైన పాయింట్‌. మూత్రం నుంచి ఎరువును త‌యారు చేయొచ్చ‌ని.. అదే కానీ జ‌రిగితే విదేశాల నుంచి ఎరువులు దిగుమ‌తి చేసుకునే అవసరం కొంతమేరకు  త‌గ్గుతుందని చెబుతున్నారు.

మూత్రంలో ఉండే న‌త్ర‌జని (నైట్రోజ‌న్‌) తో పెద్ద మొత్తంలో యూరియా త‌యారు చేయొచ్చ‌ట‌. మాన‌వ మూత్రంలో ఉండే న‌త్ర‌జ‌ని భారీగా వృధా అవుతుంద‌ని.. దాన్ని అరిక‌ట్టి సంప‌ద సృష్టించాల‌న్న‌దే త‌మ ల‌క్ష్యంగా చెప్పుకున్నారు. ఇందుకోసం స్వీడిష్ శాస్త్ర‌వేత్త‌ల‌తో క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు. మాన‌వ శ‌రీరంలోని నైట్రోజ‌న్ వృధా అవుతుంద‌ని.. దాన్ని అరిక‌ట్టి సంప‌ద సృష్టించాల‌న్న‌దే త‌న ల‌క్ష్యంగా చెప్పారు ఈ బీజేపీ నేత. ఇప్పటిదాకా ఆవు మూత్రానికే పరిమితమైన ఈ నేతలు ఇప్పుడు మానవ మూత్రం మీదా పడడం విశేషం.

ఎరువు త‌యారీకి అవ‌స‌ర‌మైన పాస్ప‌ర‌స్‌.. పోటాషియం అందుబాటులో ఉన్నాయ‌ని.. నెట్రోజ‌న్ కూడా ఉత్ప‌త్తి చేయ‌గ‌లిగితే ఎంతో మేలు జ‌రుగుతోంద‌న్నారు. అంతా బాగానే ఉంది కానీ.. మ‌రి.. మూత్రం అమ్మ‌కాలు ఎలా? అన్న ప్ర‌శ్నను అడ‌గ‌కుండానే గ‌డ్క‌రీ చెప్పారు. అదేమంటే.. ప్ర‌భుత్వం అందించే ప్లాస్టిక్ డ‌బ్బాల‌తో ప‌ది లీట‌ర్ల మూత్రాన్ని రైతుల తాలూకు కేంద్రాల‌కు తీసుకొస్తే.. లీట‌రుకు రూపాయి చొప్పున ఇస్తారు. ఈ మూత్రాన్ని వ‌డ‌గ‌ట్టి.. ప్రాసెస్ చేయ‌టం ద్వారా అది ఎరువుగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గ‌డ్క‌రీ చెబుతున్నారు. త‌న‌వి ఉత్త మాట‌లు కావ‌ని.. ఈ ప్ర‌క్రియ‌ను త‌మ సొంత గ్రామమైన ధాపేవాడ‌లో అమ‌లు చేస్తున్న‌ట్లుగా గ‌డ్క‌రీ చెప్పారు. సో.. రానున్న రోజుల్లో.. మూత్రాన్ని సైతం అమ్మేయ‌టం మొద‌ల‌వుతుంద‌న్న మాట‌.

NEWS UPDATES

CINEMA UPDATES