మల్టీస్టారర్ స్టార్ట్ చేయబోతున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

242

నందమూరి కళ్యాణ్ రామ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత మంచి రిలేషన్ ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇద్దరు అన్నదమ్ములే అయిన మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకోబోతున్నారు. “సావిత్రి” ఫేమ్ అయిన పవన్ సాధినేని వీళ్లిద్దరి కోసం ఒక సోషియో ఫాంటసీ కథని రెడి చేసాడట. కథ ఇంకా లైన్ నచ్చినా కళ్యాణ్ రామ్ వెంటనే మూవీ ని ఒకే చేసాడు అని తెలిసింది.

త్వరలో ఎన్టీఆర్ కి కూడా కథ చెప్పనున్నాడు పవన్ సాధినేని. నందమూరి కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గుణ్ణం గంగ రాజు ఈ మూవీ కి స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. జూన్ లేదా జులై నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఎన్టీఆర్ ఇంకా కళ్యాణ్ రామ్ తో పాటు హరి కృష్ణ కూడా ఈ మూవీ లో ఒక్క చిన్న రోల్ లో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది అని తెలియగానే నందమూరి ఫాన్స్ అందరూ ఏంతో హ్యాపీ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు తో బిజీ బిజీగా ఉన్నాడు.

NEWS UPDATES

CINEMA UPDATES