ప‌ద్మావతి చిత్రంలో వివాదాస్ప‌ద సీన్లు తొల‌గించాల్సిందే….

356

ప‌ద్మావ‌తి చిత్ర విష‌యంలో అభ్యంత‌రాలు వ్య‌క్తంచేస్తున్న హిందూ జ‌న జాగృతి స‌మితి సెన్సార్ బోర్డును ఆశ్ర‌యించింది. చిత్రంలో అభ్యంత‌రక‌ర సీన్ల‌ను తొల‌గించిన త‌ర్వాత‌నే సర్టిఫికేట్‌ను ప్ర‌దానం చేయాల‌ని కోరింది. ఈ విష‌య‌మై సీబీఎఫ్‌సీకి మెమోరాండం స‌మ‌ర్పించింది.

భార‌తీయ సంస్కృతికి భంగం క‌లిగే విధంగా చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించిన‌ట్లు మెమోరాండంలో హిందూ జ‌న జాగృతి స‌మితి వివ‌రించింది. ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ కోట్లాది హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే విధంగా సినిమాను తీసిన‌ట్లు జాగృతి స‌మితి …సెన్సార్ బోర్డ్‌కు తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి వ‌స్తున్న‌ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని స‌మితి కోరింది.

ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాల‌ను తొల‌గించ‌క‌పోతే ఆందోళ‌న‌లు తీవ్ర త‌రం కావ‌చ్చ‌ని….దానికి సీబీఎఫ్‌సీ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని హిందూ జ‌న జాగృతి స‌మితి హెచ్చ‌రించింది.

హిందూ జ‌న జాగృతి స‌మితి మ‌రికొన్ని విష‌యాల‌ను కూడా త‌మ మెమోరాండంలో పేర్కొంది. ఉన్న‌త హిందూ కుటుంబాల్లో జ‌న్మించిన మ‌హిళ‌లు బ‌హిరంగంగా నృత్యాలు చేసేవారు కాద‌ని….యుద్ధ‌భూమిలో శ‌తృవుల‌ను మ‌ట్టిబెట్టి వారితో డాన్సులు చేయించేవార‌ని జాగృతి స‌మితి స‌భ్యులు తెలిపారు.

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ పేరిట చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌డం త‌గ‌ద‌ని…రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు అవుతుంద‌ని జాగృతి స‌మితి పేర్కొంది. అలా చేస్తే ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లో 295 ఎ ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జాగృతి స‌మితి తెలిపింది.

NEWS UPDATES

CINEMA UPDATES