“అజ్ఞాతవాసి” టీం కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

471
pawan kalyan agnathavasi movie promotion audio launch no events trivikram

“అజ్ఞాతవాసి” షూటింగ్ కి రీసెంట్ గా టీం మొత్తం గుమ్మడికాయ కొట్టేసారు. ఈ మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్ర మొదలుపెట్టాడు. “అజ్ఞాతవాసి” రిలీజ్ కి కరెక్ట్ గా నెల టైం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు “అజ్ఞాతవాసి” టీం కి పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చాడు.

అసలు “అజ్ఞాతవాసి” ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేడట. ఈ విషయాన్ని స్వయానా పవన్ కళ్యాణ్ ఏ ప్రొడ్యూసర్స్ కి చెప్పాడట. ఓ రెండు రోజులు మాత్రం డబ్బింగ్ కి డేట్స్ ఇస్తాడని, ఆ తర్వాత మొత్తం త్రివిక్రమ్ చూసుకోవాల్సిందే అని తెలుస్తుంది.

ఈ సినిమా విడుదలకు ముందు ఆడియో వేడుకలు, ప్రీరిలీజ్ వేడుకలు వంటివి ఏమి వద్దని కూడా పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్ కు చెప్పాడట. తాను పాలిటిక్స్ తో బిజీగా ఉంటాను కాబట్టి ప్రమోషన్ కి సమయం ఇవ్వలేనని నిర్మాత, దర్శకులకి చెప్పాడట. అయితే ఇంత భారీ సినిమాకి కనీసం ఒక వేడుక అయినా చేయకపోతే ఎలా అని పవన్ కళ్యాణ్ ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.

మరి పవన్ ని కన్విన్స్ చేసి ఓ సాయంత్రం టైం తీసుకోగలిగితే ఏదైనా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లాంటిది చేసుకోవచ్చు అని టీం ప్లాన్. మరి ప్రొడ్యూసర్స్ కోరిక మన్నించి పవన్ కళ్యాణ్ చిన్న ప్రమోషన్ ఈవెంట్ కి అయినా ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES