సంక్రాంతి సినిమాలపై చర్చ.. ఆ రెండూ డౌటే

215
ఈ సంక్రాంతికి తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ రంగస్థలం ముందే తప్పుకున్నప్పటికీ.. మరిన్ని సినిమాలు బెర్త్ లు ఆక్రమించుకున్నాయి. వరుసపెట్టి తేదీలు ఎనౌన్స్ చేశాయి. ఈ గందరగోళాన్ని తప్పించేందుకు ఈరోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. కాస్త ముందుగానే ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకుంటే బెటరని చర్చలు ప్రారంభించింది.
కౌన్సిల్ సమావేశంలో జరిగిన చర్చ బట్టి చూస్తుంటే.. ఎక్కువగా సూర్య నటించిన గ్యాంగ్ సినిమాపైనే డిస్కషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. తెలుగులో యూవీ క్రియేషన్స్ సంస్థ దీన్ని సమర్పిస్తోంది. ఇప్పటికే బాలయ్య, పవన్ సినిమాలు బరిలో ఉన్న వేళ.. గ్యాంగ్ ను కూడా థియేటర్లలోకి తీసుకొస్తే తెలుగు నిర్మాతలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టవుతుంది. అందుకే ఆ సినిమా విడుదలను వాయిదా వేసుకోమని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు యూవీ నిర్మాతల్ని కోరినట్టు తెలుస్తోంది.
దీంతోపాటు సంక్రాంతికి సిద్ధమైన అభిమన్యుడు మూవీపై కూడా చర్చ జరిగినప్పటికీ దానిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. ఎఁదుకంటే తన సినిమాకు పెద్దగా థియేటర్లు దొరక్కపోయినా ఫర్వాలేదని ఆ మూవీ నిర్మాత భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ  నేపథ్యంలో గ్యాంగ్ మూవీపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీంతోపాటు రాజ్ తరుణ్ నటిస్తున్న రాజుగాడు సినిమాను కూడా సంక్రాంతి బరి నుంచి తప్పించే అవకాశాలున్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES