గంగరాజు మీద పవన్ కు మంట అందుకన్న మాట…

1635

”నేనే లేకుంటే” అనే భావన పవన్ కల్యాణ్‌లో బాగా పాతుకుపోయినట్టుగా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నా… ఏపీలో బీజేపీ నేతలు ఎంపీలయ్యారన్నా…. అది తన దయే అన్న అభిప్రాయం ఆయనలో ఉన్నట్టుగా ఉంది. తాను చేసిన సాయానికి ఎల్లవేళలా తనకు విధేయులై ఉండాలని పవన్ భావిస్తున్నారు కాబోలు. ఒంగోలు పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉంది. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు…. తాను ఫోన్ చేసినా తీయకపోవడంపై పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. అది కూడా ఇప్పటిది కాదు…. రెండేళ్ల క్రితం ఘటనను గుర్తు చేసి గంగరాజుపై మండిపడ్డారు.

రెండేళ్ల క్రితం నర్సాపురంలో తన పోస్టర్‌ను ఎవరో చించేశారని…. ఆ సమయంలో అక్కడి వృద్ధ నేతలు కుల విద్వేషాలు రెచ్చగొట్టారని పవన్‌ ఆరోపించారు. తన ఫ్యాన్స్‌లో ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారన్నారు. తన అభిమానులను అందులోనూ ఒక సామాజికవర్గం వారిని అరెస్ట్ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారన్నారు. ఆ సమయంలో గంగరాజుకు ఫోన్ చేస్తే తీయలేదన్నారు. గంగరాజు గెలుపు కోసం నాలుగు సార్లు వెళ్లి ప్రచారం చేశానన్నారు. అలాంటిది తాను ఫోన్ చేసినా తీయకపోవడం ఏమిటని పవన్ ప్రశ్నించారు. అమిత్ షా వచ్చి హైదరాబాద్‌లో తనను కలిశారని…. జనసేనను బీజేపీలో విలీనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారని పవన్ చెప్పారు. కానీ అమిత్ షా ప్రతిపాదనను తాను తిరస్కరించి పంపానన్నారు పవన్.

ఇదే సందర్భంగా…. ఓడిపోవాల్సిన పార్టీని నేనే గెలిపించానన్నారు. బీజేపీని దేశ వ్యాప్తంగా గెలిపించే స్థాయి పవన్ ది కాదు కాబట్టి ఆయన గెలిపించిన పార్టీ తెలుగుదేశమేనని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES