✓ సీఎం పదవికి అనుభవం ఉండాలి… అది మీలా నాకు తమాషా కాదు

2232

విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు వపన్ కల్యాణ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించలేని వారికి 2019లో ఓట్లు అడిగే హక్కు లేదని పెద్దపెట్టున పవన్‌ కేకలు వేస్తూ హెచ్చరించారు. అద్భుతాలు జరుగుతాయేమోనని నాలుగేళ్లుగా ఎదురుచూశానన్నారు. తాను ఏ పార్టీ పక్షం కాదన్నారు పవన్. తాను ప్రజలపక్షమే ఉంటానన్నారు.

సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌కు సెన్సార్‌లో ఇబ్బంది వస్తే ఏ ఒక్కరి దగ్గరకు తాను వెళ్లలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే జీవితంలో ఇబ్బందులు వస్తాయని బెదిరిస్తుంటారన్నారు. కానీ వాళ్లు.. ఏం పీకుతారని పవన్ ప్రశ్నించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలంటే పీక్కోండి అన్నారు పవన్. తనకు భయం అంటే తెలిదయన్నారు. తాను జైలుకెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. కానీ మ్యానిఫెస్టోలో ఉన్న విషయాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాను సపోర్ట్ చేసిన పార్టీలను కూడా నిలదీస్తానన్నారు. తాను టీడీపీ ఎంపీల కోసం తిరిగానని, కానీ వారికి ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ అంటే ఎవరో తెలియడం లేదన్నారు.

పవన్‌ కల్యాణ్ పిడికెడు మట్టే అయి ఉండవచ్చని…. కానీ ఆ మట్టి ఏం చేయగలదో చూపిస్తానన్నారు. దెబ్బలు తిన్నవాడు తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. కానీ తాను గొడవలతో కాకుండా చర్చల ద్వారా పరిష్కారం వస్తుందని నమ్ముతానన్నారు. వైఎస్ జగన్‌ కూడా డీసీఐ కార్మికులకు అండగా నిలబడాలన్నారు. తాను అధికారం కోసం పనిచేసే వ్యక్తిని కాదన్నారు. అధికారం కావాలంటే అనుభవం ఉండాలన్నారు. ముఖ్యమంత్రి పదవి మీకు( సీఎం.. సీఎం అంటూ కేకలు వేస్తున్న ఫ్యాన్స్‌ను ఉద్దేశించి) సరదా ఏమో గానీ.. తనకు మాత్రం కాదన్నారు. ప్రజల పక్షాన నిలబడడానికి అధికారం అవసరం లేదని పవన్ అభిప్రాయపడ్డారు. ఎన్నో తప్పులు జరిగినా పట్టించుకోకుండాపోతున్నారని… చర్మం మందమెక్కిపోయిందన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES