పవన్ కళ్యాణ్ కి భారీ మొత్తం ఆఫర్ చేసిన మైత్రి మూవీ మేకర్స్

423

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు మూవీస్ తో పాటు ఇటు రాజకీయాల్లోనూ బిజీ గా ఉన్నాడు. 2019 లో శాసనసభ కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి లో రాజకీయాల పై దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో స్టార్ హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలlr పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం అంత సమయం లేదు కాబట్టి సినిమాలకు గుడ్ బై చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాడట. దాంతో సినిమా చేయండి కావాలంటే సినిమాకు 40 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని స్పష్టం చేశారట మైత్రి మూవీస్ సంస్థ. ఇంతటి భారీ ఆఫర్ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఏ హీరో కి రాలేదు. భారతదేశం మొత్తంలో ఇంతటి సొమ్ము తీసుకుంటున్న హీరో ఒక్క రజనీకాంత్ మాత్రమే. మిగతా హీరోలకు ఆ స్థాయి రెమ్యునరేషన్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ కు అంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే పవన్ ఓకే చెబుతాడేమో చూడాలి. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బులు కావాలి కదా మరి. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ తీసే ఈ మూవీ కి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరిస్తాడు.

NEWS UPDATES

CINEMA UPDATES