చంద్రబాబు రాష్ట్రానికి అవసరమని ఇప్పటికీ నమ్ముతున్నా…

1883

పోలవరంపై ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తే సరిపోతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. నిధులను సక్రమంగా ఖర్చు పెట్టి ఉంటే భయపడాల్సిన అసవరం లేదన్నారు. పునరావాసానికి 33వేల కోట్లకు పెరగడానికి కారణం.. కొత్త పునరావాస చట్టమే కారణమన్నారు. ఇంజనీర్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. వాస్తవం ఇది అయినప్పుడు టీడీపీ ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తాను ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్‌ కోరారు.

పోలవరంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పోలవరంపై తేడా వస్తే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. పోలవరం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడిన పవన్‌…. 2018లోపు పోలవరం పూర్తయ్యే అవకాశమే లేదని పవన్ స్పష్టం చేశారు. పోలవరం ముంపు ప్రాంత ప్రజలను మరోసారి వచ్చినప్పుడు కలుస్తానన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES