✓ జగన్‌పై పవన్‌ ఘాటు విమర్శలు… బాబు పేరెత్తని జనసేనాని

1792

పవన్‌ కల్యాణ్‌ మరోసారి వైసీపీపై ఆక్రోశం వెళ్లగక్కారు. అవినీతిపరుడు ముఖ్యమంత్రి కాకూడదనే తాను జగన్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన మంచిపనులు ఉన్నాయి… అవినీతి కూడా ఉందని పవన్ విమర్శించారు. పాలించేవాడు అవినీతిపరుడైతే ప్రజలపైనా ఆ ప్రభావం ఉంటుందనే తాను చంద్రబాబుకు మద్దతు తెలిపానన్నారు.

తన తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి తాను ముఖ్యమంత్రి కావాలనుకోవడం అవివేకమన్నారు. లోకేష్‌ తండ్రి సీఎం కాబట్టి ఆయన్ను మంత్రిని చేశారన్నారు. లోకేష్‌ సామర్ధ్యం ఆయన తండ్రికి మాత్రమే తెలుసుకాబోలన్నారు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తిని పీఆర్పీని ముంచడం ద్వారా బలిపెట్టారన్నారు. పీఆర్పీని దెబ్బతీసిన వారెవరో తనకు బాగా తెలుసన్నారు.

వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోనన్నారు. వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెబుతానన్నారు. అయితే ప్రతిపక్షంపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్‌.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న దోపిడిపైన మాత్రం నోరువిప్పలేదు. చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. పవన్ కల్యాణ్ ప్రసంగం విన్న తర్వాత ఆయన చంద్రబాబు వైపే ఉన్నట్టు జనాలకు స్పష్టంగా అర్థమయింది.

NEWS UPDATES

CINEMA UPDATES