కేసీఆర్‌ను మరోసారి కలిసిన పయ్యావుల….

716

తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ టీడీపీ నేతలు బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. పరిటాల శ్రీరాం పెళ్లికి కేసీఆర్ హాజరుకావడం, ఆసమయంలో పయ్యావుల కేశవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించడం కొద్దిరోజుల క్రితం చర్చకు దారి
తీసింది. రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో పయ్యావుల కేశవ్, పరిటాల కుటుంబాలు బార్లు, లిక్కర్ తయారీ కంపెనీ లైసెన్స్‌లు తెచ్చుకున్నారని ఆరోపించడం దుమారం రేపింది. అయినప్పటికీ టీడీపీ నేతలు వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరోసారి కేసీఆర్‌ను పయ్యావుల కేశవ్ కలిశారు. తన సోదరుడు కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు కేసీఆర్‌ను కలిశారు.

ఆ సమయంలో ఇద్దరూ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వీడిన తర్వాత టీడీపీ- టీఆర్‌ఎస్ సంబంధాలపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా
పయ్యావుల కేశవ్… రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కుమార్తె కవిత మధ్య భాగస్వామ్యం ఉందని…. వారిద్దరు ఒక కంపెనీని కూడా రిజిస్టర్ చేశారని ఆరోపించారు. పరిటాల శ్రీరాం వివాహానికి హాజరుపై తెలంగాణవాదుల నుంచి
అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో…. పయ్యావుల ఇంట పెళ్లికి కేసీఆర్‌ హాజరు అవుతారో లేదో చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES