జేసీ బ్రదర్స్…. మీరు దద్దమ్మలు…

1642

తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరులో వైఎస్ జగన్ పాదయాత్ర సాగింది. పెద్దవడుగూరులో భారీ సభ నిర్వహించారు. సభలో ప్రసంగించిన తాడిపత్రి వైసీపీ ఇన్‌చార్జ్ పెద్దారెడ్డి… జేసీ బ్రదర్స్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. జేసీ బ్రదర్స్‌ హత్యారాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రజల కోసం మాత్రం పనిచేయడం లేదని పెద్దారెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డిని హత్య చేయడమే కాకుండా కేసులో రాజీకి రావడం లేదని వారి ఆస్తులపైనా దాడులు చేస్తున్నారన్నారు. ఆ సమయంలో పోలీసులు ఉన్నా జేసీకి భయపడి ఏమీ చేయలేని అప్రజాస్వామిక పరిస్థితులు తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నాయన్నారు.

దళితులు చర్చికి వెళ్తే వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా… బీసీ-సీ కేటగిరిలో సర్టిఫికేట్లు ఇచ్చేలా జేసీ బ్రదర్స్ ఒత్తిడి తెస్తున్నారన్నారు. దీనిపై జూపూడి ప్రభాకర్ అధికారులను ప్రశ్నిస్తే వెళ్లి ఎమ్మెల్యేను అడుక్కోండి అని తహశీల్దార్‌ చెప్పారని ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాడిపత్రిని వదిలే ప్రసక్తే లేదన్నారు పెద్దారెడ్డి. ఇక్కడి ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా ఒక్క ఫోన్ చేస్తే ప్రత్యక్షమవుతానన్నారు. తాడిపత్రి నియోజకవర్గం జేసీ వాళ్ల నాయన సొత్తా అని పెద్దా రెడ్డి ప్రశ్నించారు. జేసీ బ్రదర్స్ రాజకీయాల్లోఉంటే నష్టమే తప్ప…. లాభం ఉండదన్నారు. జగన్‌ను రేయ్‌.. అంటూ సంబోధిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి దమ్ముంటే… కుమారుడు జేసీ పవన్‌ను రేయ్‌ అని సంబోధించాలని సవాల్ చేశారు. అలా చేస్తే జేసీ దివాకర్ రెడ్డిని జేసీ పవన్ ఇంట్లో నుంచి మెడపట్టుకుని గెంటేస్తారన్నారు. జేసీ దివాకర్ రెడ్డి అంతటి చేతగాని దద్దమ్మ అని పెద్గారెడ్డి ఫైర్ అయ్యారు.

NEWS UPDATES

CINEMA UPDATES