ముందు నానితో…. తర్వాతే ….

232

“గరుడవేగా” మూవీ తో ఇండస్ట్రీ లో అందరి కంట్లో పడ్డాడు ప్రవీన్ సత్తారు. సీనియర్ హీరో అయిన డాక్టర్ రాజశేఖర్ ఈ మూవీ తో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. అయితే ఈ మూవీ తరువాత ప్రవీన్ సత్తారు ఏ హీరో ని డైరెక్ట్ చేస్తాడు, అసలు ఎవరితో మూవీ ని తీస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు. కొంత మంది అయితే ప్రవీన్ సత్తారు వెంటనే పుల్లెల గోపీచంద్ బయోపిక్ ని సుధీర్ బాబు ని హీరో గా పెట్టి తీస్తాడు అని అన్నారు. కాని ఆ ప్రాజెక్ట్ కి ఇంకా టైం ఉంది అని ప్రవీన్ సత్తారు భావించాడు.

ఇదిలా ఉంటే హీరో నితిన్ ట్విట్టర్ లో తన నెక్స్ట్ మూవీ ప్రవీణ్ సత్తారు తో ఉంటుంది అని అధికారికంగా ప్రకటించాడు. కాని ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ రెండు మూవీస్ కంటే ముందు ప్రవీన్ సత్తారు నాని తో ఒక మూవీ ని తీస్తాడట. అవును రీసెంట్ గా నాని ని కలిసి ఒక లైన్ ని చెప్పాడట ప్రవీన్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ మూవీ అయిపోగానే నితిన్ తో మూవీ ని స్టార్ట్ చేస్తాడట ప్రవీన్ సత్తారు.

NEWS UPDATES

CINEMA UPDATES