గుజ‌రాత్ ఆరోగ్య విధానం అస్త‌వ్య‌స్తం : రాహుల్ గాంధీ

156

గుజ‌రాత్‌లో పోష‌కాహార స‌మ‌స్య‌పై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ బిజెపి ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. రాష్ట్రంలో 39 శాతం మంది పిల్ల‌లు పోష‌కాహార లోపంతో స‌త‌మ‌త‌మౌతున్నార‌ని…ఇదేనా బిజెపి అనుస‌రిస్తున్న‌ ఆరోగ్య‌విధానం అని ఎద్దేవా చేశారు.

అదే విధంగా భుజ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని అదానీ గ్రూప్‌కు లీజ్‌కు ఇవ్వ‌డాన్ని కూడా రాహుల్ గాంధీ త‌ప్పుబ‌ట్టారు. 99 సంవ‌త్స‌రాల పాటు లీజ్‌కి ఇవ్వ‌డం అనేది బిజెపి అనుస‌రిస్తున్న వండ‌ర్ అని రాహుల్ ఎద్దేవా చేశారు.

శిశు మ‌ర‌ణాల‌పై కూడా రాహుల్ గాంధీ బిజెపి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప్ర‌తి వెయ్యి మందిలో 33 మంది శిశువులు మ‌ర‌ణిస్తున్నార‌ని రాహుల్ గాంధీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రతి రోజు ప్ర‌భుత్వానికి ఒక ప్ర‌శ్న సంధిస్తున్న రాహుల్ గాంధీ ఇప్ప‌టి వ‌ర‌కు బిజెపి ప్ర‌భుత్వానికి ఏడు ప్ర‌శ్న‌లు వేశారు. ఎనిమిదో ప్ర‌శ్న ద్వారా ఆరోగ్య‌రంగంలో లోపాల‌ను ఎత్తిచూపారు.

గ‌త కొన్ని రోజులుగా రాహుల్ గుజ‌రాత్ రాష్ట్రంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూపుతున్నారు. బిజెపి నేత‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. నిరుద్యోగ స‌మ‌స్య‌, విద్య, ఆరోగ్యం, మ‌హిళా భ‌ద్ర‌త‌, గృహ‌నిర్మాణ హామీల‌పై బిజెపి నాయ‌కుల‌ను రాహుల్ గాంధీ నిల‌దీస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES