షాజ‌హాన్‌తో జ‌య్ షా కు లింకు

627

తాజ్‌మ‌హ‌ల్ ప‌రిస‌రాల్లో హిందు యువ వాహినికి చెందిన కార్య‌క‌ర్త‌లు శివ చాలీసా చ‌ద‌వ‌డం వివాదంగా మారింది. రాష్ట్ర స్వాభిమాన్ ద‌ళ్ స‌భ్య‌ల‌తో పాటు హిందు వాహినికి చెందిన కార్య‌క‌ర్త‌లు తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద శివ చాలీసా జ‌పిస్తూ అక్క‌డ పూజ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు.  సిఐఎస్ఎఫ్ బ‌ల‌గాలు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో వ‌దిలివేశారు.

బిజెపి నేత విన‌య్ క‌తియార్ మాత్రం వారిని వెన‌కేసుకొచ్చారు. వారు చేసిన దాంట్లో త‌ప్పేమీ లేద‌ని అన్నారు. తాజ్‌మ‌హ‌ల్ ఉన్న ప్రాంతంలో ఒక‌ప్పుడు శివాల‌యం ఉండేద‌ని చెప్ప‌డానికి చాలా ఆధారాలు ఉన్నాయ‌ని విన‌య్ క‌తియార్ తెలిపారు.

విన‌య్ క‌తియార్ మాట‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు రాజ్‌బ‌బ్బ‌ర్‌, పిఎల్ పూనియాలు ఖండించారు. దేశంలో జ‌రుగుతున్న కొన్ని వివాదాస్ప‌ద అంశాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ల్లించ‌డానికి బిజెపి ఇటువంటి చీప్ ట్రిక్స్‌కు పాల్ప‌డుతుంని రాజ్‌బ‌బ్బ‌ర్ అన్నారు.

జ‌య్ షా కంపెనీల వ్య‌వ‌హారం తెర‌మీద‌కు రాగేనే కంగారు ప‌డ్డ బిజెపి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ల్లించ‌డానికి వారికి షాజ‌హాన్ గుర్తుకు వ‌చ్చాడ‌ని అందుకే అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని రాజ్‌బ‌బ్బ‌ర్ అన్నారు.

షాజ‌హాన్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు తీసి జ‌య్ షా వ్య‌వ‌హారం తొక్కిపెట్టాల‌ని బిజెపి ఆడుతున్న నాట‌కం అని ఆయ‌న అన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES