జక్కన్న కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?

265

ఇప్పుడు రాజమౌళి నోరు మెదిపినా.. మెదపకున్నా వార్తే అవుతోంది. బాహుబలి లాంటి భారీ విజయాన్ని తన భుజాలపై ఇంకా మోస్తూనే ఉన్న రాజమౌళి.. తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడన్న చర్చ.. చాన్నాళ్లుగానే సినిమా ఇండస్ట్రీలో నడుస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తోనే ఆ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందుతోందని.. ఇద్దరు టాప్ హీరోలు బాక్సర్లుగా నటిస్తున్నారని రూమర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతలోనే.. మరో రూమర్.. ఈ మూవీ గురించి బయటికొచ్చింది. ఇందులో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా అనూ ఇమాన్యుయేల్ ను ఫిక్స్ చేసేశారట. ఇప్పటికే అజ్ఞాతవాసిలో పవన్ కల్యాణ్ పక్కన, నా పేరు సూర్యాలో అల్లు అర్జున్ పక్కన నటిస్తున్న ఈ భామ.. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఇంతలోనే.. ఇలా జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ పక్కన.. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ చేతిలో అనూ పడిందన్న వార్త.. టాలీవుడ్ లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతానికి ఈ వార్త రూమర్ గానే ఉంది. ఈ విషయంపై.. ఎవరో ఒకరు త్వరలో నోరు విప్పాల్సిందే.

NEWS UPDATES

CINEMA UPDATES