అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న రాజశేఖర్

300

ఇటివలే “గరుడవేగా” సినిమా తో మళ్ళి హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నాడు సీనియర్ హీరో అయిన డాక్టర్ రాజశేఖర్. ఇప్పుడు ఎక్కడ చుసిన ఇండస్ట్రీ లో ఈ మూవీ టాపికే. ఎందుకంటే ఈ మూవీ ఇక్కడే కాకుండా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులుపుతుంది. ఇదిలా ఉంటే రాజశేఖర్ అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడట. అల్లు అర్జున్ ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన “s/o అఫ్ సత్యమూర్తి” లో ఉపేంద్ర క్యారెక్టర్ కి ముందుగా రాజశేఖర్ ని అనుకున్నారట. స్వయంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజశేఖర్ ని కలిసి ఈ పాత్ర చేయాలి అని కోరాడట. కాని ఆ మూవీ మెగా హీరో కి చెందిన మూవీ కావడం తో కొంత మంది పనిగట్టుకొని మరి రాజశేఖర్ ని ఆ మూవీ ని మిస్ చేసుకునేలా చేసారట. ఒకవేళ ఆ మూవీ లో గాని ఉపేంద్ర ప్లేస్ లో రాజశేఖర్ గాని నటించి ఉంటే ఈపాటికి రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక పది హిట్ మూవీస్ లో నటించి ఉండేవాడు. ఇదిలా ఉంటే మొన్న ఒక ఇంటర్వ్యూ లో రాజశేఖర్ మాట్లాడుతూ చిరంజీవికి తనకి ఎలాంటి గొడవలు లేవు అని “గరుడవేగా” కి చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేసారు అని చెప్పుకొచ్చాడు.

NEWS UPDATES

CINEMA UPDATES