చించేసిన పేజీలను అతికిస్తా- బాబుకే వర్మ కౌంటర్

501

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రంపై టీడీపీ నేతల విమర్శలకు వర్మ అంతే వేగంగా, ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు సోమిరెడ్డి, అనిత లాంటి వారికే కౌంటర్‌ ఇస్తూ వచ్చిన వర్మ ఇప్పుడు చంద్రబాబుకు కూడా కౌంటర్ ఇచ్చారు. వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రాన్ని పట్టించుకోవద్దని నేతలకు చంద్రబాబు సూచన చేసిన నేపథ్యంలో వర్మ స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చంద్రబాబు మాటలకు సమాధానంగా.. ‘సీబీఎన్ గారన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమే.. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకంలోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను’ అంటూ కౌంటర్ వేశారు.  మొత్తం మీద వర్మను కంట్రోల్ చేయడం టీడీపీ నేతలకు పెద్ద సవాల్‌గానే మారింది. బహుశా వర్మను గిల్లకుండా ఉండడమే టీడీపీకి బెటరేమో.

NEWS UPDATES

CINEMA UPDATES