నాగార్జున కోసం పవర్ ఫుల్ టైటిల్ ని సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

232

నాగార్జున ఇంకా రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ “శివ”. ఈ మూవీ ఇండియన్ సినిమా లోనే వన్ అఫ్ ది బెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్‌లో ఒక మూవీ స్టార్ట్ అయ్యింది. R కంపెనీ పై రామ్ గోపాల్ వర్మయే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ చెప్తున్నాయి.

అయితే ఈ మూవీ కోసం రామ్ గోపాల్ వర్మ రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ని లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి “గన్” కాగా మరొకటి “సిస్టం” అంట. ఈ రెండు టైటిల్స్ లో రామ్ గోపాల్ వర్మ ఈ మూవీకి ఏ టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు అనేది ఇంకా తెలియదు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ ఎండింగ్ లో ముంబైలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకోబోతుంది.

NEWS UPDATES

CINEMA UPDATES