పూర్తిగా చంద్రబాబులా మారిన రానా

854

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్య స్టిల్స్ ను రిలీజ్ చేసిన యూనిట్.. ఇప్పుడు చంద్రబాబు గెటప్ లో ఉన్న రానా స్టిల్ ను విడుదల చేసింది. ఈ ఫొటోతో ప్రాజెక్టుపై ఆసక్తిని మరింత పెంచే ప్రయత్నం చేసింది. ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో చంద్రబాబు ఎలా ఉండేవారో, సరిగ్గా అదే లుక్స్ లో రానాను ముస్తాబు చేశారు.

అప్పట్లో చంద్రబాబు ధరించిన దుస్తులను పోలిన కాస్ట్యూమ్స్ నే వాడారు. ఇప్పుడంటే చంద్రబాబుకు చిన్నపాటి తెల్లగడ్డం ఉంది కానీ, అప్పట్లో బాబు క్లీన్ షేవ్ లో ఉండేవారు. మీసం మాత్రం దట్టంగా పెంచేవారు. సేమ్ టు సేమ్ అదే గెటప్ ను ఫాలో అయ్యారు దర్శకుడు క్రిష్.

ఎన్టీఆర్ బయోపిక్ లో బాబు పాత్ర కోసం రానా, క్రిష్ కలిసి చాలానే కసరత్తు చేశారు. గెటప్ పై క్రిష్ రీసెర్చ్ చేస్తే, చంద్రబాబు మేనరిజమ్స్ పై రానా కసరత్తు చేశాడు. తర్వాత ఇద్దరూ వెళ్లి ప్రత్యేకంగా చంద్రబాబును కలిశారు కూడా. దాదాపు 5 గంటల పాటు వీళ్లంతా మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఎన్టీఆర్ ను గద్దె దింపి తను ముఖ్యమంత్రి అయిన టైమ్ లో జరిగిన కొన్ని సంఘటనల్ని చంద్రబాబు వీళ్లకు వివరించారు. మొత్తమ్మీద రానా లుక్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

NEWS UPDATES

CINEMA UPDATES