“రంగస్థలం” రేట్స్ చూసి భయపడ్డ స్టార్‌ ప్రొడ్యూసర్‌

280

ఇండస్ట్రీ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలు చాలా మంది తమ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటారు. అయితే అలాంటి నిర్మాత “రంగస్థలం” నిర్మాతలకి భయపడ్డాడట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న మూవీ “రంగస్థలం”. ఈ సినిమా పై భారీ క్రేజ్ ఏర్పడటంతో ఆ చిత్రాన్ని నైజాం లో రిలీజ్ చేయాలని ముందుకు వచ్చాడు దిల్ రాజు. అయితే ఆ సినిమా హక్కుల కోసం మైత్రి మూవీస్ చెప్పిన రేటు చూసి భయపడ్డాడట దిల్ రాజు.

“రంగస్థలం” కేవలం నైజాం హక్కుల కోసం 20 కోట్లు చెల్లించాలని చెప్పారట. ఆ రేట్ విని షాక్ అయ్యి దిల్ రాజు సైలెంట్ అవ్వడం తో ప్రభాస్ నిర్మాతలు అయిన యువి క్రియేషన్స్ ముందుకు వచ్చి 18 కోట్లకు బేరం కుదుర్చుకొని “రంగస్థలం” నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ సినిమాకు ఒక్క నైజాం రేటు 18 కోట్లు అంటే చాలా ఎక్కువ అయినప్పటికీ ప్రభాస్ నిర్మాతలు ధైర్యం చేసి నైజాం లో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇకపోతే ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా భారీ బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నారు నిర్మాతలు.

NEWS UPDATES

CINEMA UPDATES