“రంగస్థలం” తో బోయపాటికి ఇబ్బంది ?

274

బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక మూవీ తీస్తున్నాడు. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో సెకండ్ షెడ్యూల్ కి వెళ్లనుంది. అయితే ఈ మూవీ మొదటి షెడ్యూల్ ని రామ్ చరణ్ లేకుండానే ఫినిష్ చేశాడు బోయపాటి. అలా చేయడానికి కారణం “రంగస్థలం”. అవును ఈ మూవీ మొదటి షెడ్యూల్ జరిగే టైం కి “రంగస్థలం” మూవీ రీ షూట్ జరుపుకుంటుంది.

అయితే ఇప్పుడు మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కి కూడా రామ్ చరణ్ రావట్లేదు.. కారణం “రంగస్థలం” ఆడియో రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్, అలాగే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ బిజీ గా ఉన్నాడట. ఇప్పుడు ఇదే…. బోయపాటి శ్రీను కి ఇబ్బంది గా మారింది. రామ్ చరణ్ ఇంకో నెల వరకు గాని ఫ్రీ కాడు. నెల తరువాత రామ్ చరణ్ షూటింగ్ లో జాయిన్ అయితే మూవీ ని ఆగష్టు వరకు ఫినిష్ చేయడం కష్టమే అవుతుంది బోయపాటికి. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న “రంగస్థలం” మూవీ ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని మూవీ పై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు.

NEWS UPDATES

CINEMA UPDATES