రేపే విడుదల…. రంగస్థలం ఫస్ట్ లుక్.. బీ రెడీ

142

మెగా అభిమానులను మురిపించే వార్త ఇది. ఓ వైపు రంగస్థలం సినిమా షూటింగ్ వ్యవహారాలతో.. మరోవైపు సైరా నిర్మాణ వ్యవహారాలతో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇన్నాళ్లకు తన అభిమానుల సరదా తీరుస్తున్నాడు. చాలా కాలంగా.. అభిమానులనే కాదు.. ఇండస్ట్రీ జనాలతో పాటు.. సినిమా ప్రేక్షకుల్లోనూ అంచనాలను పెంచేస్తున్న రామ్ చరణ రంగస్థలం సినిమా.. మీడియాలో సందడి మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది.

మెగా అభిమానుల్లో ఉన్న ఆకలిని తీరుస్తూ.. రేపు సాయంత్రమే.. అంటే డిసెంబర్ 8న సాయంత్రం ఐదున్నర గంటలకే.. రంగస్థలం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. సమంత హీరోయిన్ గా.. 1985 నాటి చిత్ర కథాంశంతో వస్తున్న ఈ సినిమాను.. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. తన స్టయిల్ కు భిన్నంగా.. గ్రామీణ నేపథ్యంలో ఈ సినమా చేస్తున్నాడు.

ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలో.. రామ్ చరణ్ హీరో కావడం, సమంత హీరోయిన్ కావడం.. ఇలా ఇంట్రెస్టింగ్ కాంబో కుదరడంతో.. సినిమా ప్రేక్షకులు.. కొన్ని రోజులుగా రంగస్థలంపై చర్చించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు.. సినిమా ఫస్ట్ లుక్ విడుదల టైమ్ ఫిక్స్ అవడంతో.. అంతా ఆ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. చెర్రీ, సమంత.. ఎలా ఆకట్టుకుంటారో!

NEWS UPDATES

CINEMA UPDATES