చరిత్రాత్మక క్యారెక్టర్ లో… రాశీ ఖన్నా?

213

తమిళ్ లో హీరోయిన్ గా రాశీఖన్నా ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉంది. అంతలోనే ఆమెకు మరో లక్కీ చాన్స్ వచ్చేసినట్టు తెలుస్తోంది. జయం రవితో నటించిన ఏ హీరోయిన్ అయినా తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఆయనతోనే తన నెక్స్ట్ సినిమా చేసేందుకు రాశీ రెడీ అయిపోయిందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.

ప్రస్తుతం రాశీఖన్నా.. తమిళ్ లో ఇమైకా నోడిగళ్ సినిమాలో అధర్వ తో నటిస్తోంది. ఇటు.. శక్తి సౌందరరాజన్ దర్శకత్వంలో జయం రవి చేస్తున్న సినిమా కూడా పూర్తి కావొచ్చింది. తన కొత్త సినిమాగా.. సుందర్ సి దర్శకత్వంలో భారీ చరిత్రాత్మక చిత్రం చేసేందుకు జయం రవి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఆ సినిమాలో.. రాశీఖన్నాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. డేట్స్ కూడా సర్దుబాటు చేసేందుకు రాశీఖన్నా రెడీ అవుతోంది. లక్కీ హీరోతో చాన్స్ రావడంతో.. ఆమె కూడా ఫుల్ హాపీగా ఉందట. కాకపోతే.. అఫిషియల్ గా ఈ న్యూస్ కన్ఫమ్ కావాల్సి ఉంది.

అయితే.. ఇది చారిత్రక కథాంశం అని తెలుస్తుండడంతో.. రాశీఖన్నా ఎలాంటి రోల్ ప్లే చేస్తుందా అని అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి. నీళ్లలాంటి మనస్తత్వం ఉన్న రాశీ.. ఏ కేరెక్టర్ లో అయినా ఇట్టే ఒదిగిపోగలదులే.. అని ఆమె అభిమానులు కూడా అప్పుడే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. చూద్దాం.. ఏమవుతుందో!

NEWS UPDATES

CINEMA UPDATES