✓ వెంకయ్యది ఘనకార్యమే…. పొగడాలంటేనే ఇబ్బంది….

955
venkaiah naidu, Sharad Yadav, Ali Anwar, JDU,Nithish,Bihar,BJP,Rajyasabha,chairman,loksobha speaker,Andhra pradesh,speaker,kodela

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల ఫిరాయింపు సంగతి స్పీకర్‌ కోడెలకు కాసేపు వదిలేస్తే… ముగ్గురు వైసీపీ ఎంపీలు కూడా ఏపీలో ఫిరాయించారు. ప్రమాణస్వీకారం చేయకుండా ఎస్పీవై రెడ్డి, కొద్ది రోజులు ఆగి కొత్తపల్లి గీత, ఈ మధ్య బుట్టా ముగ్గురూ టీడీపీలోకి ఫిరాయించారు. వారిపై వైసీపీ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతపై ఫిర్యాదు చేసి ఏళ్లు గడుస్తోంది.

కానీ వారిపై నో యాక్షన్. ఇక వారిపై అనర్హత వేటు పడుతుందన్న ఆశ కూడా చాలా మందిలో చచ్చిపోయింది. ఆ ఫిరాయింపులు వెంకయ్యనాయుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయి. కానీ వాటిపై ఆయన ఏనాడు గట్టిగా స్పందించింది లేదు. ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతి అయ్యారు. రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ తన ముందుకు వచ్చిన రెండు అనర్హత పిటిషన్లపై అప్పుడే తేల్చేశారు.

బీజేపీని వ్యతిరేకించిన బీహార్‌కు చెందిన శరద్‌యాదవ్, అన్వర్‌లపై అనర్హత వేటు వేసేశారు వెంకయ్య. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ, కాంగ్రెస్‌తో కూటమి కట్టి విజయం సాధించిన నితీష్ .. కొన్ని నెలల క్రితం బీజేపీతో కలిసిపోయారు. దీన్ని జేడీయూ సీనియర్‌ నేత శరద్ యాదవ్ వ్యతిరేకించారు. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓట్లేసిన బీహర్‌ ప్రజలకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. అంతేకాదు ఆగస్ట్‌లో బీజేపీకి వ్యతిరేకింగా జరిగిన ర్యాలీలోనూ ఆయన పాల్గొన్నారు. అంతే వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ జేడీయూ రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.

వెంకయ్య కూడా నెలల వ్యవధిలోనే శరద్ యాదవ్‌, మరో జేడీయూ ఎంపీ అన్వర్‌పై అనర్హత వేటు వేశారు. వారి రాజ్యసభ సభ్యత్వాలు రద్దు చేశారు. మరి లోక్‌సభలో మూలుగుతున్న వైసీపీ ఎంపీ అనర్హత పిటిషన్ల సంగతి ఏంటి?. దీనికి భారతదేశంలో సమాధానం దొరకడం కష్టం. అంటే వెంకయ్య నిజాయితీగా వ్యవహరిస్తే.. లోక్‌సభ స్పీకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భావించాలా?. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే…. సాధారణంగా వెంకయ్యనాయుడు ఇలాంటి ఘనమైన పనులు చేస్తే తెలుగు మీడియా ఓ రేంజ్‌లో ప్రచారం కల్పించేది.

కానీ ఈసారి ఎందుకో సంయమనంపాటించింది. బహుశా వెంకయ్యనాయుడు ఇద్దరు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేశారన్న విషయం జనానికి తెలిస్తే… మరి పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎంపీల సంగతేంటని ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో మీడియా సంయమనం పాటించింది కాబోలు. ఏదైనా ప్రపంచంలోనే భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్విస్తూ ఆనందించే సమయంలోనే.. ఈ ఫిరాయింపులు, నీచ రాజకీయాలు అప్పుడప్పుడు సిగ్గుపడేలా చేస్తున్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES