అందుకే శేఖర్ కమ్ములకి నో చెప్పాను – రెజినా

459

ఇప్పుడు యువ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న రెజినా అప్పట్లో శేఖర్ కమ్ములకి నో చెప్పిందట. అవును శేఖర్ కమ్ముల మొదట “లైఫ్ ఇస్ బ్యూటిఫుల్” మూవీ లో వన్ అఫ్ ది హీరోయిన్ గా రెజినా ని సెలెక్ట్ చేసాడట. అయితే అందులో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండటం వల్ల తనకు పెద్దగా పేరు రాదని భావించే ఆ సినిమా ఒప్పుకోలేదని రెజీనా చెప్పింది. అప్పటికి తాను తెలుగులో సినిమాలేమీ చేయనప్పటికీ ఆ ఆఫర్ తిరస్కరించానని తెలిపింది. దీని బదులు “ఎస్ఎంఎస్” సినిమా ద్వారా సోలో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికే ఓటు వేసిందట రెజినా.

ఇక మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్‌తో పని చేసే అవకాశం కూడా అనుకోకుండా కోల్పోయినట్లు రెజీనా చెప్పింది. దూరదర్శన్ కోసం తాను ఓ షో చేశానని ఆ షో డైరెక్టర్ మణిరత్నంకు అసిస్టెంట్ అని, అలా “యువ” సినిమాలో సూర్య చెల్లెలి పాత్రకు అతను రికమండ్ చేయడంతో మణిరత్నం ఓకే చెప్పారని, కానీ అదే సమయంలో తన ఫ్యామిలీ మరో ఇంటికి మారడంతో అడ్రస్ కనుక్కోలేకపోయారని అలా తనకు అవకాశం మిస్సయిందని రెజీనా చెప్పింది. మొత్తానికి కెరీర్ స్టార్ట్ అవ్వకముందు రెజినా మంచి మంచి అవకాశాలే మిస్ చేసుకుంది అనమాట.

NEWS UPDATES

CINEMA UPDATES