పాత బాస్‌ని మ‌ళ్లీ క‌లిసిన రేవంత్‌

3298

టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి పై ఇప్పుడు పుల్ ఫోక‌స్ ఉంది. ఆయ‌న ఏం చేసినా వార్తే అవుతుంది. కాంగ్రెస్‌లో కీల‌క నేత‌ల‌ను క‌లుస్తూ పార్టీలో త‌న బెర్త్ ప‌దిలం చేసుకుంటున్నారు. రాజకీయంగా తెలంగాణ‌లో క్రియాశీల‌కంగా మారుతున్నారు. డిసెంబ‌ర్ 9 నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో త‌న మార్క్ చూపిస్తాన‌ని రేవంత్ ఇంత‌కుముందే ప్ర‌క‌టించారు. అయితే ఇటీవ‌ల మ‌ళ్లీ త‌న పాత బాస్‌ను రేవంత్ అనుకోకుండా క‌లిశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిని రేవంత్ ఓ పెళ్లిలో క‌లుసుకున్నార‌ని తెలిసింది. మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య మ‌న‌వడి పెళ్లిలో చంద్ర‌బాబు,రేవంత్ అనుకోకుండా ఎదురుప‌డ్డారు. పెళ్లికొడుకు,కూతురికి ఆశీస్సులు అందించి చంద్ర‌బాబు వెన‌క్కి తిరిగి చూడ‌గానే ప‌క్క‌నే రేవంత్ క‌నిపించార‌ట‌. దీంతో రేవంత్ ఎలా ఉన్నావ‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించార‌ట‌. ఐయామ్ ఫైన్ సార్ అని రేవంత్ అన్నాడ‌ట‌. వెంట‌నే చంద్ర‌బాబు రేవంత్ భుజాల‌పై చేయి వేసి త‌ట్టాడ‌ట. ఇటు రేవంత్‌తో వెంట‌నే చిన‌బాబు మాట‌లు క‌లిపార‌ట.  మొత్తానికి బాబు, రేవంత్ బంధం గ‌ట్టిద‌ని మ‌రోసారి  ఈఘ‌ట‌న‌తో రుజువైంది.

NEWS UPDATES

CINEMA UPDATES