రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సాయి ధరం తేజ్ “జవాన్”

372

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ గత రెండు చిత్రాలు అయిన “తిక్క”, “విన్నర్” బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే తన నెక్స్ట్ మూవీతో మళ్ళీ ఎలాగైనా తన ఫార్మ్ ని తిరిగి తెచ్చుకోవాలి అన్న కసితో “జవాన్” సినిమాని స్టార్ట్ చేసాడు సాయి ధరం తేజ్. రచయిత బివిఎస్ఎన్ రవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే అన్ని పనుల్ని పూర్తిచేసుకుంది. అసలైతే ఈ మూవీ ఆగష్టు లో రిలీజ్ అవ్వాలి. కానీ షూట్ లేట్ అవ్వడం వల్ల మూవీ ని సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ చేసారు. తీరా సెప్టెంబర్ లో “స్పైడర్”, “జై లవ కుశ” వంటి భారీ బడ్జెట్ మూవీస్ ఉండటంతో ఈ మూవీ ని సెప్టెంబర్లో కూడా రిలీజ్ చెయ్యకుండా మళ్ళీ వాయిదా వేసారు.

అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 1న ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ లో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ మూవీ డిసెంబర్ లో అయినా ప్రేక్షకుల ముందుకి వస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే సాయి ధరం తేజ్ ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వం లో చేస్తున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు కరుణాకరన్ దర్శకత్వంలో కూడా ఒక మూవీని స్టార్ట్ చేసాడు సాయి ధరం తేజ్.

NEWS UPDATES

CINEMA UPDATES