సాయి ధరమ్ తేజ్ ని కాపాడేది ఎవరు?

220

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ రీసెంట్ మూవీ అయినా “జవాన్” తేజుని ప్లాప్స్ నుంచి గట్టెకించి హిట్ ని అందిస్తుంది అని అనుకున్నారు అంత. కానీ అందుకు భిన్నంగా బివియస్ రవి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతానికి అంతంత మాత్రంగానే ఆడుతుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే “జవాన్” కూడా సాయి ధరమ్ తేజ్ కి హిట్ ని అందించలేకపోయింది.

ఇదిలా ఉంటె ఇప్పుడు తేజుని ప్లాప్స్ నుంచి గట్టెకించే హిట్ ఇవ్వగలిగే దర్శకులు ఇద్దరే ఉన్నారు అందులో ఒకరు వి.వి.వినాయక్ కాగా మరొకరు కరుణాకరన్. అవును ప్రస్తుతం వీళ్లిద్దరు సాయి ధరమ్ తేజ్ తో కలిసి మూవీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇద్దరు మంచి దర్శకులే అవ్వడం మూలాన ఈ రెండు మూవీస్ లో ఏదైనా ఒక మూవీ గట్టి హిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి సాయి ధరమ్ తేజ్ ని ఈ ఇద్దరిలో ఎవరు సక్సెస్ ని అందిస్తారో వేచి చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES