దిల్ రాజుని షాక్ కి గురిచేసిన సాయి పల్లవి

343
“ఫిదా” చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా మారింది సాయి పల్లవి. “ఫిదా” మూవీని నిర్మించిన దిల్ రాజుయె సాయి పల్లవికి “MCA” ద్వారా మరో ఆఫర్ ఇచ్చాడు. ఇలా రెండు ఆఫర్స్ ఇచ్చి తెలుగు ఇండస్ట్రీ లో సాయి పల్లవిని స్టార్ హీరోయిన్ చేసిన  దిల్ రాజు మాటకి అడు చెప్పింది సాయి పల్లవి. ఇంతకి అసలు విషయం ఏంటి అంటే దిల్ రాజు ప్రస్తుతం నితిన్ హీరోగా సతీష్ వేగ్నేశ డైరెక్టర్ గా “శ్రీనివాస కళ్యాణం” అనే మూవీని తీస్తున్నాడు. అయితె ఈ మూవీలో నితిన్ సరసన సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నాడు అంట దిల్ రాజు. కాని దిల్ రాజు ఇచ్చిన ఈ ఆఫర్ ని సాయి పల్లవి రిజెక్ట్ చేసింది అంట. అసలైతే “ఫిదా” మూవీ టైంలోనే సాయి పల్లవి దిల్ రాజు ప్రొడక్షన్లో మరో రెండు మూవీస్ చెస్తాను అని సైన్ చేసింది అంట, కాని ఇప్పుడు ఆ అగ్రీమెంట్ ని బ్రేక్ చేస్తూ సాయి పల్లవి దిల్ రాజు ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. మరి సాయి పల్లవి ఈ ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది అనే కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటె ప్రస్తుతం ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకునే పనిలో ఉన్నాడు దిల్ రాజు.

NEWS UPDATES

CINEMA UPDATES